బాధపడితే క్షమాపణ చెబుతా.. గుడికి నేను కూడా చందా ఇస్తా

కోరుట్ల: అయోధ్య రామ మందిరంపై వివాస్పద వ్యాఖ్యలు చేసిన కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.. ఆ కామెంట్స్ పై వివరణ ఇచ్చారు. తాను కేవలం బీజేపీ నేతల గురించి మాత్రమే మాట్లాడాననీ.. రామాలయం గురించి కాదన్నారు. రాముని పేరుతో చందాలు వసూలు చేస్తున్న బీజేపీ వాళ్లకే ఎందుకు పేరు రావాలని అన్నానన్నారు. తాను రామభక్తుణ్నేననీ.. 33 ఏళ్లుగా తాను అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నానని చెప్పారు. తాను ప్రతిరోజూ పొద్దున్నే దేవుని పూజ చేసుకుని దేవుడి ఫొటో చూశాకే బయటకు వస్తానని అన్నారు. తాను కూడా రాముడి గుడికి ఐదు లక్షలో.. పదిలక్షలో ఇస్తానని చెప్పారు. తన కామెంట్స్ కు ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. పార్టీ ముసుగులో దేవుని పేరు మీద చందాలు సేకరించాడాన్నే తాను ప్రశ్నించానని, చందాలు వసూలు చేసే బాధ్యత మాకు ఇస్తే మేము కూడా చేస్తామని అన్నారు. తన మాటలతో హిందువులు బాధపడితే క్షమాపణలు చెబుతున్నానని ఎమ్మెల్యే అన్నారు.

Latest Updates