హైదరాబాద్ కు బీజేపీ ఎం ఇచ్చిందో చెప్పాలి

హైదరాబాద్ నగరం గత ఆరేళ్లలో మార్పు చెందిందన్నారు ఎమ్మెల్సీ కవిత. దేశంలోని ఇతర నగరాలకు దీటుగా హైదరాబాద్ లో మౌళిక సదుపాయాలు ఉన్నాయన్న ఆమె.. దేశంలోనే అన్ని నగరాలను మించి అమెజాన్, గూగుల్ లాంటి కంపెనీలను హైదరాబాద్ ఆకర్షిస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ను ఇప్పటికే ఎంతో అభివృద్ధి చేసిందని..జీహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే, ఇతర రాష్ట్రాల నుండి కొందరు నాయకులు టూరిస్టుల్లాగ వచ్చి ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారన్నారు. బెంగుళూరు నుండి వచ్చిన ఒక యువనేత బాధ్యతగా మాట్లాడకుండా, He wants to Change Hyderabad, Change Telangana, Change South India అని మాట్లాడుతున్నారన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరబాద్ లో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన విషయాన్ని కళ్లు తెరచి చూడాలన్నారు.

బీజేపీ హైదరాబాద్ కు ఏం ఇచ్చింది, ఏం ఇవ్వనుంది అనే అంశాలపై మాట్లాడకుండా, బీజేపీ నాయకులు అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడుతున్నారన్నారు. రాజకీయ లబ్ది కోసం బీజేపీ నేతలు మాట్లాడే మాటలకు యువత ఆవేశాలకు లోను కావొద్దని, కేవలం డెవలప్ మెంట్ గురించే ఆలోచించాలన్నారు ఎమ్మెల్సీ కవిత. అయితే సోమవారం హైదరాబాద్ కు వచ్చిన బీజేవైం యువమోర్చా జాతీయ అధ్యక్షులు, తేజస్వి సూర్య హైదరాబాద్ డెవలప్ మెంట్ గురించి మాట్లాడిన విషయం తెలిసిందే.

Latest Updates