కాగజ్ నగర్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. అటవీ శాఖ అధికారులపై దాడి చేసిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ సహా 14 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. దాడిలో పాల్గొన్న మరో 16 మందిపైనా కేసులు నమోదయ్యాయి. వారంతా పరారీలో ఉండటంతో పోలీసులు గాలిస్తున్నారు. దాడిలో  గాయపడిన FRO అనితకు హైదరాబాద్ లో మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

ఎమ్మెల్యే  సోదరుడు కోనేరు కృష్ణ అరెస్ట్ పై ఆయన అనుచరులు మండిపోతున్నారు. ఫారెస్ట్ అధికారుల తీరుకు నిరసనగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అటు అటవీ అధికారులు దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. ఎమ్మెల్యే సోదరుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఇరు వర్గాలు నిరసనకు దిగుతాయనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అదనపు బలగాలను మోహరించారు. వరంగల్ జోన్ ఐజీ నాగిరెడ్డి కాగజ్ నగర్ పరిస్థితులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Latest Updates