ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే మదన్మోహన్

ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం  : ఎమ్మెల్యే మదన్మోహన్

ఎల్లారెడ్డి, వెలుగు : ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్​ పని చేస్తుందని ఎమ్మెల్యే మదన్​మోహన్ అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి మండలంలోని వేలుట్ల, అన్నాసాగర్ గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాల భవనాలను డీఎంహెచ్​వో చంద్రశేఖర్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఒక్కో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం రూ.20 లక్షలు కేటాయించిందన్నారు. 

వైద్య సిబ్బంది ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేస్తే  కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యాధికారి పద్మజ, మతమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శరత్ కుమార్, సీహెచ్​వో ఠాకూర్, హెచ్ఈవో గోవింద్ రెడ్డి జనార్దన్ రెడ్డి, సూపర్​వైజర్లు రాజేశ్వరీ, బీఏఎం ఎస్ వైద్యులు అజ్మతుల్లా, ఎల్లారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   ]

ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి 

ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్​మోహన్​ అన్నారు. శుక్రవారం పట్టణంలో నూతనంగా నిర్మించిన ఏటీసీ సెంటర్  ను ఎమ్మెల్యే పరిశీలించి మాట్లాడారు.  విద్యార్థులు శ్రద్ధతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. అనంతరం ఎల్లారెడ్డి, తాడ్వాయి మండలాల్లో ఏటీసీ సెంటర్లలో ఉన్న కోర్సులపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఏటీసీ సెంటర్ ప్రిన్సిపాల్ రూపానాయక్, ఏటీవో చంద్ర శేఖర్, సిబ్బంది హరీశ్, కాంగ్రెస్​మండలాధ్యక్షుడు కురుమ సాయిబాబా, పట్టణ అధ్యక్షుడు వినోద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.