‘డబ్బు తీసుకొని ఓటేశారు.. మీ పంటలకు నీళ్లు రావు’: రైతులపై ఎమ్మెల్యే ఫైర్

కొండాపూర్‌ రైతులపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఫైర్‌  అయ్యారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులతో పాటు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హజరైన మండలానికి చెందిన కొండాపూర్ గ్రామ రైతులపై విరుచుకుపడ్డారు.  ‘‘ సర్పంచ్‌ ఎన్నికల్లో డబ్బు తీసుకోకుండా ఓటేశారా? డబ్బులు తీసుకుని తప్పు చేశారు.. పంటలకు నీళ్లు రావు పోండి’’ అంటూ వారిపై మండిపడ్డారు. ‘మొగోని లెక్క తప్పు ఒప్పుకొంటే రెండు పంటలకు నీళ్లు ఇస్తా’నని అన్నారు. ఈ సందర్భంగా కూటిగల్‌ నల్ల చెరువులో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, చెరువును నీటితో నింపాలని ఎమ్మెల్యేను కోరగా… పై విధంగా వ్యాఖ్యానించారు.

Latest Updates