కాలనీవాసులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన‌ ఎమ్మెల్యే మైనంపల్లి

హైద‌రాబాద్: ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న వర్షానికి ఆగమాగమయ్యారు మల్కాజిగిరి వసంతపురి కాలనీవాసులు. విష‌యం తెలుసుకున్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాలనీవాసులకు నిత్యావసర వస్తువులను అందించారు. గత రెండు రోజులనుండి కుండపోతగా కురిసిన వర్షానికి మల్కాజిగిరిలోని పలు కాలనీవాసుల ఇండ్లలో వరద నీరు చేరింది. వారంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలుసుకొని, ఎమ్మెల్యే మైనంపల్లి మంగ‌ళ‌వారం రాత్రి నుండి ఈస్ట్ ఆనంద్ బాగ్, ఎన్.ఎండీసి కాలనీ, సఫీల్ గూడ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. కాలనీవాసులకు పాలు, బిస్కెట్లు, రైస్ తదితర వస్తువులను తన సొంత ఖర్చుతో పంపిణీ చేశారు.

స్థానిక ఎమ్మార్వో తో ఫోన్ లో మట్లాడి కాలనీవాసులకు కావాల్సిన నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని ఆదేశించారు. అలాగే వర్షం పడుతున్నప్పటి నుండి వసంతపురి కాలనీవాసుల ఇండ్లలోకి నీరు చేసి అస్తవ్యస్తంగా మారిందని.. త్వరలోనే వరదనీటి సమస్యను పరిష్కస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

Latest Updates