ఎమ్మెల్యే నోముల అంత్యక్రియలు పూర్తి

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే, నకిరేకల్ ముద్దుబిడ్డ నోముల నర్సింహయ్య అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ఆయన స్వగ్రామమైన పాలెంలో పూర్తయ్యాయి. ఈ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ప్రగతిభవన్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన ఆయన.. డైరెక్ట్‌గా నర్సింహయ్య అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. నోముల నర్సింహయ్య భార్య, కుమారుడిని ఓదార్చారు. సీఎం కేసీఆర్ చేరుకున్న కాసేపటికే అంత్యక్రియల కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ అంత్యక్రియలలో జిల్లాకు చెందిన లీడర్లే కాకుండా.. రాష్ట్రంలోని పలువురు నాయకులు, అభిమానులు, సీపీఎం పార్టీ కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఆయన టీఆర్ఎస్‌లో చేరడానికి ముందు నకిరేకల్ నియోజకవర్గంలో సీపీఎం పార్టీ నుంచి 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేసే తత్వం కలవాడు కాబట్టి పేదల కష్టాలు ఆయనకు బాగా తెలుసు. అందుకే కష్టమంటూ తన దగ్గరికొచ్చిన ప్రతివారికి సాయం చేశాడు. ఆయన నకిరేకల్ నియోజకవర్గంలో తిరగని ఊరు లేదు. కాబట్టే ఆయనకు ప్రతి ఊరులోనూ అభిమానులు వేలసంఖ్యల్లో ఉంటారు.

For More News..

నగరంలో 92 మంది పోలీసుల సస్పెన్షన్ నిజం కాదు

క్లాస్‌రూంలో పెళ్లి చేసుకున్న ఇంటర్ విద్యార్థులు

భోపాల్ గ్యాస్ ఘటన నుంచి తప్పించుకున్న 102 మంది కరోనాతో మృతి

Latest Updates