ఎమ్మెల్యే తుపాకీ డాన్సింగ్ పై పార్టీ సీరియస్

ఏ ఎమ్మెల్యే కూడా నా అంత ఫిట్‌గా లేరు : ప్రణవ్

ఉత్తరాఖండ్ నేత, సస్పెండెడ్ బీజేపీ ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్ సింగ్ ఛాంపియన్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తుపాకులు పట్టుకుని బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాల్ హల్ చల్ చేస్తోంది. దీనిపై సీరియస్ అయిన ఉత్తరాఖండ్ బీజేపీ… ప్రణవ్ సింగ్ ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని అధిష్టానాన్ని కోరింది.

అయితే తనపై వస్తున్న విమర్శలను తప్పుబట్టారు ప్రణవ్ సింగ్. మీడియా తన పాజిటివ్ యాంగిల్ చూపించడంలేదన్నారు. బుల్లెట్లు లేని తుపాకీలు, ఎవరిపై గురి పెట్టకుండా డ్యాన్స్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. 53 ఏళ్ల వయసులోనూ దేశంలోనే అత్యంత ఫిట్ గా ఉన్న ఎమ్మెల్యే తాను మాత్రమేనన్నారు. 53 ఏళ్ల వయసులో దేశంలో తన వయసులో అంత ఫిట్ గా ఎమ్మెల్యేను చూపించమని సవాల్ చేశారు.

Latest Updates