ప్రతిసారీ కేంద్రాన్ని విమర్శించడం కరెక్ట్ కాదు

అన్ని రంగాల్లో రాష్ట్రానికి కేంద్ర సహకారం ఉందని, ప్రతిసారి కేంద్రాన్ని విమర్శించడం కరెక్ట్ కాదని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. అసెంబ్లీ లో బడ్జెట్ పై సాధారణ చర్చ లో భాగంగా  రాజాసింగ్  మాట్లాడుతూ.. కేసీఆర్ గజ్వేల్ కి మాత్రమే సీఎం  కాదని,  రాష్ట్రానికి కూడా సీఎం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.  తన నియోజకవర్గం గోషామహల్  అభివృద్ధి కోసం ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా చెత్తబుట్టలో వేస్తున్నారని అన్నారు. గవర్నమెంట్ పాఠశాలలు సమస్యలకు నిలయంగా మారాయన్న బీజేపీ ఎమ్మెల్యే..  ప్రతీ నియోజకవర్గంలో విద్య కోసం వంద కోట్లు కేటాయించాలని చెప్పారు. కేజీ టు పీజీ విద్య ఎక్కడ వరకు వచ్చిందని ఈ సందర్భంగా ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పటివరకు ఎన్ని ఇచ్చారు? ఎన్ని కట్టారు?  వాటి లెక్క చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాజాసింగ్. 30 వేల కోట్ల బడ్జెట్ ను ఎలా పుడ్చుకుంటారని, అప్పులపై స్పష్టత ఇవ్వాలని చెప్పారు.

Latest Updates