నియోజకవర్గానికి వచ్చేందుకు అనుమతి అవసరం లేదు

నియోజకవర్గానికి వచ్చేందుకు అనుమతి అవసరం లేదు

మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య మధ్య నెలకొన్న విబేధాలు మరోమారు బయటపడ్డాయి. పదవీ కాలం ముగిసినా.. కడియం శ్రీహరి ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనడం ఏంటని ప్రశ్నించారు ఎమ్మెల్యే రాజయ్య.  రాజయ్య వ్యాఖ్యలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు కడియం.

ప్రజా సేవ చేయడానికి పదవులు,ప్రోటోకాల్ అవసరం లేదన్నారు మాజీ ఎమ్మెల్సీ కడియం. స్టేషన్ ఘనపూర్ లో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కడియం శ్రీహరి.. ఎమ్మెల్యే రాజయ్య వాఖ్యలు సరికాదన్నారు. జూన్ 2తో తన పదవీకాలం ముగిసింది.. నియోజకవర్గానికి రావడానికి ఎవరి లైసెన్స్, అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు పదవి ఉన్నా.. లేకున్నా  అందుబాటులో ఉండిసేవ చేయడమే తన లక్ష్యమన్నారు కడియం. అంతేకాదు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

దేవాదుల సాగునీరు గురించి మాట్లాడని వారు, దేవాదులపై అవగాహన లేనివారు కూడా హడావుడి చేయడం విడ్డురంగా ఉందని విమర్శించారు కడియం శ్రీహరి.