రాజాసింగ్ వీడియో: నేను దుబ్బాక వస్తున్నా.. ఎవడు ఆపుతాడో చూస్తా..

దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా సోమవారం ప్రచారానికి వెళ్లిన బండి సంజయ్‌పై పోలీసుల దాడిని నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. తనపై జరిగిన దాడికి నిరసనగా.. బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో తలుపులు వేసుకొని దీక్షకు కూర్చున్నారు. ఆయనకు మద్ధతుగా బీజేపీకి చెందిన పలువురు నేతలు దుబ్బాక బాటపట్టారు. ఆ ఉద్దేశంతోనే బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా దుబ్బాక వెళ్లడానికి బయలుదేరుతుండగా.. పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు ఎంతకాలం తనను ఆపుతారో చూస్తానంటూ రాజాసింగ్ మండిపడ్డారు. తన హౌస్ అరెస్ట్ గురించి మాట్లాడుతూ ఆయన ట్వీట్ చేశారు.

‘నేను భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్‌గా.. దుబ్బాక వెళ్దామంటే నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. నా ఇంటి చుట్టుపక్కల మొత్తం పోలీసులతో నింపేశారు. ఇన్‌స్పెక్టర్ వచ్చి చెప్పాడు. సార్.. మీరు వెళ్లకూడదు.. మీరు హౌస్ అరెస్ట్ అని చెప్పాడు. అప్పుడు నేను అడిగాను. భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ దుబ్బాక వెళ్తున్నారు. మరి నాకేందుకు ఆపుతున్నావ్. టీఆర్ఎస్ వాళ్లకు అంతభయమా ఈ రాజాసింగ్ అంటే.. పోలీసుల దగ్గర సమాధానం లేదు. కానీ ఎప్పటివరకు నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారు. వస్తున్నా.. నేను దుబ్బాక వస్తున్నా.. 100 పర్సెంట్ వస్తా.. ప్రచారం చేస్తా.. వాని కుక్కలకి, గుండాలకి వాళ్ల బాషలోనే నేను జవాబు ఇస్తా.. నన్ను ఎవడు ఆపుతాడో నేను చూస్తా..’ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో ట్వీట్ చేశారు.

For More News..

రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతల హౌస్ అరెస్టులు

కేక్ కట్ చేసిన కాసేపటికే కానరానిలోకాలకు.. బర్త్‌డేనే డెత్ డే అయింది

ఆస్ట్రేలియా టూర్‌‌కు టీమిండియా ఎంపిక.. ఒక్క ఫార్మాట్‌కు ఎంపిక కాని రోహిత్ శర్మ

Latest Updates