నాకు గన్ మెన్లు వద్దు : రేగా కాంతారావు

ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తనకు భద్రత కల్పించే గన్‌ మెన్లను వెనక్కి పంపారు. ప్రభుత్వం సమకూర్చిన గన్‌ మెన్లను తిప్పిపంపుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. హంగు ఆర్బాటాలకు దూరంగా ఉండాలని తాను భావిస్తున్నట్టుగా కాంతారావు ప్రకటించారు. తన నిర్ణయం వెనుక ఎలాంటి ఒత్తిడులు లేవన్నారు. తన నియోజక వర్గ ప్రజలే తనకు రక్షణగా ఉంటారని చెప్పారు.

తన వ్యక్తిగత సిబ్బంది ఆరుగురినీ ప్రభుత్వం ఉపయోగించుకోవాలని కోరారు ఎమ్మెల్యే రేగా కాంతారావు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు.

Latest Updates