కేసీఆర్ కు గ్రాండ్ వెల్ కమ్ పలికిన రోజా

mla-roja-grand-welcome-to-cm-kcr-at-nagari

సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా తమిళనాడులోని  కాంచీపురంలో అత్తివరదరాజ స్వామిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరిన కేసీఆర్ చిత్తూరు రేణిగుంట ఎయిర్  పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కాంచీపురం వెళ్లారు. దారి మధ్యలో నగరికి చేరుకోగానే ఎమ్మెల్యే రోజా , వైఎస్సార్సీపీ నేతలు కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. కాంచీపురం అత్తివరదరాజ స్వామి ఆలయానికి చేరుకోగానే ఆలయ అధికారులు కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం అత్తివరదరాజ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.  కేసీఆర్ వెంట ఆమె సతీమణి శోభ, కూతురు కవిత, రోజా, పలువురు ఉన్నారు. అక్కడి నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్ కు రానున్నారు కేసీఆర్.

Latest Updates