క్యారెక్టర్లు మార్చినట్లు పవన్ పార్టీలు మారుస్తున్నారు

బీజేపీ జనసేన పొత్తుపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.  ప్యాకేజీల కళ్యాణ్.. పొత్తుల కళ్యాణ్ గా మారారన్నారు. పొత్తులు, ప్యాకేజీల కోసమే పవన్ పార్టీ పెట్టినట్టున్నారన్నారు. పాచిపోయిన లడ్డూలు ఇపుడు తాజాగా మారాయా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై పోరాటాం ఎందుకు ఆపారో పవన్ చెప్పాలన్నారు. సినిమాల్లో క్యారెక్టర్లు మార్చినట్లు పవన్ పార్టీలు మారుస్తున్నారన్నారు. పవన్ లాంటి వాళ్లు యూత్ ఐకాన్ ఎప్పటికీ కాలేరన్నారు. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన సీఎం రమేశ్, సుజనా చౌదరిలాంటి వాళ్లతో పాటు పవన్ ను ఎందుకు బీజేపీలోకి తీసుకున్నారో అర్థం కావడం లేదన్నారు. జగన్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక అన్ని పార్టీలు ఏకమవుతున్నాయన్నారు రోజా.

మరిన్ని వార్తల కోసం..

పవన్ ను చూస్తే జాలేస్తుంది..ఇక సినిమాలు చేసుకుంటే బెటర్

Latest Updates