గట్టిగ అరిస్తే గడ్డిపరక సింహం కాదు

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే రోజా. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడా.. పనికిమాలిన నాయకుడా అంటూ విమర్శించారు. . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సభలో నిరసన తెలిపితే బైటకు లాగేశారన్నారు. రూల్స్ కు విరుద్దంగా తనను ఏడాది పాటు సస్పెండ్ చేశారని మండిపడ్డారు .ఇదే అసెంబ్లీలో బోండా ఉమా నన్ను పాతి పెడతా అన్నప్పుడు.. చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. గట్టిగా అరిస్తే.. గడ్డిపరక సింహం కాదన్నారు రోజా. వయసు మీద పడుతున్నా కొద్ది చంద్రబాబుకు చాదస్తం ఎక్కువవుతుందన్నారు .

Latest Updates