సీఎం జగన్ ఇంటికి ఎమ్మెల్యే రోజా

mla-roja-went-to-cm-jagan-house-in-vijayavada

అమరావతి : కేబినెట్ లో మంత్రి పదవి దక్కలేదని మనస్తాపంతో ఉన్నారన్న వార్తల మధ్య..  సీనియర్ ఎమ్మెల్యే రోజాకు… ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఈ ఉదయం నగరి ఎమ్మెల్యే రోజాకు విజయ సాయి రెడ్డి ఫోన్ చేశారు. సాయంత్రం విజయవాడలోని సీఎం ఇంట్లో జగన్ ను కలవాలని సూచించారు.

సీఎం ఇంటినుంచి ఫోన్ రావడంతో… రోజా హైదరాబాద్ నుంచి విజయవాడలోని సీఎం ఇంటికి బయల్దేరి వెళ్లారు.

వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా రోజాకు పేరుంది. ఐతే.. రోజాకు మంత్రి పదవి రాలేదు. జగన్ మంత్రివర్గ విస్తరణకు కూడా రోజా హాజరుకాలేదు. ఆమెకు మహిళా సంక్షేమ శాఖ కమిషనర్ పోస్ట్ ఇవ్వాలని జగన్ భావించినట్టుగా వార్తలొచ్చాయి. దీనిపై ఇవాళ చర్చ జరిగే అవకాశం ఉంది.

మరోవైపు.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి కూడా సీఎం ఇంటినుంచి ఫోన్ వెళ్లింది.

Latest Updates