ఉద్యమాలను కేసీఆర్ అణిచివేస్తున్నారు

అణిచివేతను ఆయుధంగా చేసుకుని కేసీఆర్ ఉద్యమాలను అణిచివేస్తున్నారని అన్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆమె…విద్యార్థులపై, ఉద్యోగులపై జరిగిన పోలీస్ లాఠీ చార్జ్ ను ఖండింస్తున్నట్లు చెప్పారు. టీచర్ల సమస్యలను పరిష్కరించాలంటూ అసెంబ్లీకి వస్తున్నవారిని కేసీఆర్ ప్రభుత్వం అరెస్ట్ చేసి అక్రమంగా కేసులు పెట్టిందని అన్నారు. ఆశా వర్కర్‌లకు జీతాలు పెంచామని చెప్పి ఎన్నిలయ్యేవరకు 7500రూపాయలు ఇచ్చారని ఆతర్వాత 3వేల రూపాలయలే ఇస్తున్నారని చెప్పారు. కేసీఆర్ స్వయంగా జీతాలు పెంచుతున్నామని చెప్పడంతో ఆశా వర్కర్లు నమ్మి.. ఇప్పుడు మోసపోయారని చెప్పారు.

Latest Updates