గిరిజ‌న రైతుల‌పై పెట్టిన కేసులు ఎత్తివేయాలి

మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ లో కొన్ని సంవత్సరాల నుండి పోడుభూములు సాగుచేసుకుంటన్న గిరిజన రైతులపై ప్రభుత్వం దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. వెంట‌నే ప్ర‌భుత్వం చొర‌వ తీసుకుని గిరిజన రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు. బయ్యారం, గార్ల మండలల్లో ఉన్న 35 వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్ర‌భుత్వం కుట్రపన్నుతుంద‌న్నారు.

ఎలక్షన్ ముందు సీఎం కేసీఆర్ పోడు భూముల రైతులకు పట్టాలు ఇస్తామని ప్రకటించి, ఇప్ప‌టివరకు ఇవ్వ‌లేద‌న్నారు. వెంట‌నే ప‌ట్టాలు ఇవ్వ‌కుంటే మానుకోట కేంద్రం నుండి రాష్ట్ర వ్యాప్తంగా పోడు రైతుల సమస్యలపై పోరాటం నిర్వహిస్తామ‌ని కేసీఆర్ స‌ర్కార్ ను హెచ్చ‌రించారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయం ప్ర‌భుత్వం మరిచిపోయింద‌న్నారు ఎమ్మెల్యే సీత‌క్క‌.

 

Latest Updates