పేద‌ల ఆక‌లి తీర్చే సీత‌క్క ఛాలెంజ్

నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండే ఎమ్మెల్యే సీత‌క్క పేద ప్ర‌జ‌ల కోసం మంచి ఆలోచ‌న చేశారు. పేద‌ల‌కు సాయం చేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. లాక్ డౌన్ వ‌ల్ల చాలామందికి ఒక పూట తిండి కూడా దొర‌క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అలాంటి వాళ్ల ఆక‌లిని తీర్చేలా సీత‌క్క కొత్త ఛాలెంజ్ ను విసురుతున్న‌ట్లు వీడియో ద్వారా తెలిపారు.

గోహంగర్ గో పేరుతో ప్రారంభించిన ఈ ఛాలెంజ్ లో ఒక‌రు కొంత మంది పేద‌ల‌కు ఆహారం పంపిణీ చేయాలి. వారు మ‌రొక‌రికి ఇలాగే ఛాలెంజ్ చేయాలి. ఎవ‌రికీ ఉప‌యోగ‌ప‌డ‌ని ఛాలెంజుల క‌న్నా ఆక‌లితో అల‌మ‌టించేవారి ఆక‌లిని తీర్చే ఈ ఛాలెంజ్ మంచిదంటున్నారు నెటిజ‌న్లు. ఇప్ప‌టికే లాక్ డౌన్ క్ర‌మంలో ఇంట్లో కాళీగా ఉన్న కొంద‌రు ర‌క‌ర‌కాల ఛాలెంజ్ ల‌తో టైమ్ పాస్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

Latest Updates