కరోనా పేషంట్లకు వైద్యం చేసిన ఏపీ ఎమ్మెల్యే

తన ఎమ్మెల్యే హోదానే పక్కనపెట్టి కరోనా పేషంట్లకు వైద్యం చేసి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఎమ్మెల్యే. అనంతపురం జిల్లా కదిరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పీవీ. సిద్ధారెడ్డి వృత్తిరిత్యా డాక్టర్. ఆయన తన ఎమ్మెల్యే హోదాను కూడా పక్కనపెట్టి కరోనా పేషెంట్లకు వైద్యం అందించారు. పట్టణ పరిధిలో పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్న మొత్తం 82 మంది కరోనా పాజిటివ్ పేషెంట్లను పేరు పేరునా పలకరించారు. ప్రతి పేషెంట్ కు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న కొందరు పేషెంట్లను కోవిడ్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పారు. అక్కడ భోజన సౌకర్యాలపై కూడా ఎమ్మెల్యే ఆరా తీశారు. ప్రతిరోజు చికెన్ తో పాటు మంచి భోజనం పెడుతున్నారని పేషెంట్లు అందరూ ముక్తకంఠంతో చెప్పారు. సాక్షాత్తు ఎమ్మెల్యేనే వచ్చి పీపీఈ కిట్ ధరించి తమకు వైద్యం అందించడంతో కరోనా పేషెంట్లు ఆనందం వ్యక్తంచేశారు.

For More News..

ఎమ్యెల్యే రామలింగారెడ్డి మృతి నాకు వ్యక్తిగతంగా తీరని లోటు

జ‌మ్ముక‌శ్మీర్ తొలి గ‌వ‌ర్న‌ర్ రాజీనామా.. రెండో గవర్నర్‌గా మ‌నోజ్ సిన్హా

Latest Updates