విద్యాసాగర్ కామెంట్స్: టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం

జగిత్యాల జిల్లా : అయోధ్య రామాలయ నిర్మాణంపై కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జగిత్యాల జిల్లా, మెట్ పల్లిలో బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతంగా మారింది. ఎమ్మెల్యే విద్యాసాగర్ ను అడ్డుకునేందుకు పెద్దఎత్తున బీజేపీ నేతలు మెట్ పల్లికి చేరుకున్నారు. అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు.. బీజేపీ నేతలను అడ్డుకున్నారు. పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేసినా.. బీజేపీ నేతలు తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేయగా.. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.  బీజేపీ- టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య సద్దుమణిగిన గొడవ. ఇరు వర్గాలను అక్కడినుంచి పంపించేసిన పోలీసులు. మెట్పల్లిలోని విద్యాసాగరరావు ఇంటిముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయోధ్య రామ మందిర్ నిర్మాణంపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. అయోధ్యలో నిర్మించే రామాలయానికి చందాలివ్వొద్దని చెప్పారు. బీజేపీ నేతలు అయోధ్య రామాలయం పేరుతో బిచ్చమెత్తు కుంటున్నారన్నారని అన్నారు. జగిత్యాలలో జరిగిన రెండో విడత గొర్రెల పంపిణీ సభలో ఈ విధంగా మాట్లాడారు. మన గ్రామాల్లో రాముడు లేడా.. ఉత్తర ప్రదేశ్ లో రామాలయానికి చందాలెందుకు ఇవ్వాలని కామెంట్ చేశారు. బొట్టుపెట్టుకుంటేనే రామభక్తులా..  తాము కూడా శ్రీరాముని భక్తులమే అన్నారు ఎమ్మెల్యే విద్యాసాగర్.

Latest Updates