స్టేజీపైనే గొడవకి దిగిన టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

MLAs Raja Gopal Reddy and Bhupal Reddy are fighting on the stage

నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన బీట్ మార్కెట్ పంచాయితీ రాజ్ సమ్మేళనం రసాభాసగా మారింది. స్టేజీ పైనే ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. గత పాలకులు చేసిన అభివృద్ధి శూన్యమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి విమర్శించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి  అభ్యంతరం తెలిపారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు స్టేజీపైకి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్లడంతో పోలీసులు కలగజేసుకొని గొడవ సద్దుమణిగేలా చేశారు.

Latest Updates