ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రెండు రాష్ట్రాల్లో 10 స్థానాల్లో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను రిలీజ్ చేసింది ఈసీ. ఈ నెల 21 న నోటిఫికేషన్ విడుదల కానుంది. 28వ తేదీ వరకు నామినేషన్లకు చివరి తేదీ. మార్చి 1 న నామినేషన్లు పరిశీలించనున్నారు. మార్చి 5 వరకు నామినేషన్ల విత్ డ్రాకు గడువిచ్చింది ఎన్నికల సంఘం. మార్చి 12 న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ఉండనుంది.  మార్చి 15 వరకు ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్‌లో 5 స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఇక రాష్ట్రం నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, కాంగ్రెస్ సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, షబ్బీర్ అలీ తో పాటు, సంతోష్ కుమార్, మహమ్మద్ సలీంల పదవీ కాలం ముగియనుంది.

Latest Updates