నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వరు.. ఫాం హౌజ్ లు మాత్రం నిర్మించుకుంటరు

నిభందనలకు విరుద్ధంగా క్యాచ్ మెంట్ ఏరియాలో మంత్రి కేటీఆర్ ఫాం హౌజ్ ను నిర్మించుకున్నారని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన… హిమాయత్ సాగర్, గండిపేట క్యాచ్ మెంట్ ఏరియాలో నిర్మాణాలు చేపట్టవద్దని ఇచ్చిన జీవోను అమలు చేయాలని డిమాండ్ చేస్తే  కాంగ్రెస్ నాయకులపై కేసు పెట్టారని చెప్పారు. క్యాచ్ మెంట్  ఏరియాలో నిర్మాణాలు చేపట్టవద్దని జీవోలు ఇచ్చి .. కేటీఆర్ మాత్రం 25 ఎకరాల్లో విలాసాల కోసం ఫాం హౌసులు కట్టుకుంటున్నారని అన్నారు. అక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించమని అడిగితే మంత్రి కేటీఆర్ కేవలం లీజుకు తీసుకున్నాడని ఆయన అనుచరులు చెబుతున్నారని అన్నారు జీవన్ రెడ్డి.

రాష్ట్రంలోని విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ లేదని, ఉద్యోగాలు లేవని అన్నారు. సీఎం కేసీఆర్ మాత్రం తన కుటుంబానికి విలాసాలు కల్పించుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ సమాజం కోరుకున్నది దీనికోసమేనా అని ప్రశ్నించారు. ఇలాంటి విషయాలను ప్రజలు గుర్తించాలని కోరారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఫ్లెక్సీలు పెట్టినా కేటీఆర్ జరిమానాలు విధించాలని ఆదేశించడం అభినందనీయమని చెప్పారు.

Latest Updates