జగిత్యాలలో పోలీసులపై జీవన్ రెడ్డి ఆగ్రహం

జగిత్యాల జిల్లా పురానిపేటలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. 41వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి పోలింగ్ సెంటర్ లో ఉండటంతో కాంగ్రెస్ తో పాటు బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఓటర్లను TRS అభ్యర్థి ప్రభావితం చేస్తున్నాడని ఆరోపించారు.  ఆ విషయాన్ని పోలీసులకు చెప్పినా పట్టించుకోక పోవడంతో … కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.  అంతేకాదు వారిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నం చేశారు. అదే సమయంలో అక్కడి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి…విషయం తెలుసుకుని సీఐ జయేష్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు.

Latest Updates