భూ నిర్వాసితుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి

జగిత్యాల జిల్లా: పంపు హౌస్ నిర్మాణంలో కాలువల కంటే టన్నెల్ నిర్మాణమే చౌకైనదని, కమీషన్ల కోసమే కేసీఆర్ స‌ర్కార్ టన్నెల్ కు బదులు కాలువల నిర్మాణం చేప‌ట్టింద‌ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని పెగడపల్లి మండలం ఏడుమోటలపల్లె లో కాళేశ్వరం లింక్ -2 పంపు హౌస్ భూనిర్వాసితులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు.

ఈ సంద‌ర్భంగా జీవ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. భూ నిర్వాసితుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. వారికి సరైన న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత మంత్రి ఈశ్వర్ దే అని అన్నారు. భూ నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రం ఏర్పడి అరున్నర యేళ్ళు గడిచినా.. టీఆర్ఎస్ పార్టీది ఉమ్మడి రాష్ట్ర జపమేన‌ని ఆయ‌న‌ అన్నారు.

MLC Jeevan Reddy visits Kaleshwaram Link-2 pump house landlords

Latest Updates