నష్టపోయిన రైతులను ఆదుకోండి: కేసీఆర్ కు జీవన్ రెడ్డి లేఖ

మొన్నటి వరకు పడిన భారీ వర్షలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ కు లేఖ రాసినట్టు తెలిపారు కాంగ్రెస్ లీడర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.  పంట నీట మునగడంతో కనీసం హార్వేస్ట్ లు కూడా దిగే పరిస్థితి లేదని అన్నారు.ప్రభుత్వం సానుకూలంగా స్పందించి… పంటనష్టం పై కేంద్రానికి రిపోర్ట్ పంపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇన్ ఫుట్ సబ్సిడీ పొందవచ్చని ఆయన తెలిపారు.

రుణమాఫీ పట్ల ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో బ్యాంకర్లు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని జీవన్  రెడ్డి అన్నారు.  రైతు బంధు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని…. కనీసం బ్యాంకు కైనా రైతు కి రుణాలను ఇచ్చే విదంగా అదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.  తడిసిన ధాన్యం, రంగుమారిన వరిని ప్రభుత్వం  కొనుగోలు చేయాలని కోరారు.  మొక్కజొన్నని మార్కు ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి.. మద్దతు ధర ఇవ్వాలి అని కోరుతున్నామని అన్నారు.

Latest Updates