కూల్చడం ఆపితే అభివృద్ధి అడ్డుకున్నట్టే : కర్నె

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు అజెండాలు పక్కన పెట్టీ కలిసి తిరుగుతున్నాయన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్. సెక్రటేరియట్, అసెంబ్లీ కట్టకుండా అడ్డుకోవాలని  అఖిల పక్షాలు గవర్నర్ ను కలవటంపై స్పందిస్తూ.. కొత్త నిర్మాణాలు కట్టకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు రాష్ట్రం లో వుండటం దురదృష్టకరమని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ను అనునిత్యం అడ్డుకున్న కాంగ్రెస్.. కోర్ట్ కు వెళ్లి అడ్డుకోవాలనుకున్నా ప్రాజెక్ట్ ను నిర్మించామని,  ఈ క్రెడిట్ టిఆర్ఎస్ కు రాకుండా డైవర్ట్ చేసేందుకే సచివాలయం, అసెంబ్లీ అంశాన్ని కాంగ్రెస్ తెరపైకి తెచ్చిందన్నారు.

గతంలో బైసన్ పోలో గ్రౌండ్ లో అసెంబ్లీ నిర్మిస్తామని ప్రభుత్వం చెబితే.. అక్కడెందుకు.. వున్న దగ్గరనే కొత్తవి కట్టండని ప్రతిపక్షాలు అన్నాయని, ఇప్పుడు ఇక్కడనే నిర్మిస్తాం అంటుంటే వీటిని కూడా అడ్డుకుంటున్నాయని అన్నారు. సౌకర్యాల లేమి .. గౌరవం కోసమే కొత్త అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలని ఎమ్మెల్సీ ఈ సందర్భంగా తెలిపారు.

బీజేపీ నేతలు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. నాలుగు సీట్లు గెలువగానే ఇదే విజయం అనుకుంటున్నారని కర్నే విమర్శించారు.

Latest Updates