పాశమైలారం ప్రమాదంలో క్షతగాత్రులను పరామర్శించిన  ఎమ్మెల్సీ కవిత

పాశమైలారం ప్రమాదంలో క్షతగాత్రులను పరామర్శించిన  ఎమ్మెల్సీ కవిత

రామచంద్రాపురం/పటాన్​చెరు,వెలుగు: పాశమైలారం ప్రమాదంలో గాయపడి పటాన్​చెరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్సీ కవిత మంగళవారం పరామర్శించారు.  ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులతో మాట్లాడి వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

 ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.  మృతి చెందిన కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్‌‌‌‌ఎస్ అండగా ఉంటుందన్నారు. వారికి ఆర్ధిక భరోసా కల్పించాల్సి బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.