మున్సిపల్ ఎన్నికల్లో మాదే భారీ విజయం: ఎమ్మెల్సీ పల్లా

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని అన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. శుక్రవారం తెలంగాణ భవన్ లో మాట్లాడిన ఆయన… ఎన్నికల నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తప్పించుకోజూశాయని అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో… ఎన్నికలను తప్పించుకోవడానికి కోర్టుల్లో కేసులు వేసేందుకు కాంగ్రెస్-బీజేపీ పోటీ పడ్డాయని అన్నారు. నల్గొండ పార్లమెంట్ లో అన్ని స్థానాలను టీఆరెస్ కైవసం చేసుకోబోతుందని అన్నారు.

కాంగ్రెస్ లీడర్ భట్టి విక్రమార్క అసెంబ్లీ ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్ట పోయిందని.. చంద్రబాబు ధనం ఇవ్వడంవల్ల భట్టి అసెంబ్లీలో గెలిచారని చెప్పారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ దూరం అయిందని తెలిపారు. కేసీఆర్  సాధిస్తున్న విజయాల నుంచి కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకోవాలని అన్నారు. ఎన్నికల్లో బీజేపీ మతం తప్ప వేరే ప్రచారం చేయలేదని… ప్రజలకు సంబంధించి ఒక్క విషయం మాట్లాడలేదని తెలిపారు. అశాంతి కావాలంటే బీజేపీ-అభివృద్ధి కావాలంటే టీఆరెస్ అనే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్ళామని చెప్పారు.

Latest Updates