MLC ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

కరీంనగర్: మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి టీచర్స్, గ్రాడ్యుయేట్ స్థానాల లెక్కింపు జరుగుతోంది. కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ ఉదయం ప్రారంభమైంది.

ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్సులను ఎన్నికల పరిశీలకుడు బుర్రా వెంకటేశం తెరిచారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి టీచర్స్, గ్రాడ్యుయేట్ స్థానాలకు ఈనెల 22న పోలింగ్ జరిగింది.

అటు ఆంధ్రలోనూ కౌంటింగ్ 

ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు విశాఖలో జరుగుతోంది. ఈ స్థానానికి మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు పోటీపడగా, 17,305 మంది తమ ఓటేశారు. ప్రస్తుత ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, పాకలపాటి రఘువర్మ, అడారి కిషోర్‌కుమార్‌, జన్నెల బాలకృష్ణ మధ్యే గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఉదయం 8 గంటలకు స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఫలితం ప్రకటనకు దాదాపు ఏడు గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభించి సాయంత్రం 3 గంటలకు పూర్తి చేస్తారు.

Latest Updates