బట్టేబాజ్ గాళ్లు తెలంగాణ గాంధీపై బక్వాస్ మాటలు మాట్లాడుతుండ్రు

హైదరాబాద్: కొంతమంది బట్టేబాజ్ గాళ్ళు తెలంగాణ గాంధీ అయిన కేసీఆర్ పై బక్వాస్ మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మండిపడ్డారు. బీజేపీకి బండి సంజయ్ ఎలా ప్రెసిడెంట్ అయ్యారో అర్థం కావడం లేదన్నారు. బీజేపీ నేతలు ఏ భాషలో మాట్లాడితే తామూ అదే భాషలో అలాగే మాట్లాడాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.

‘మీ పద్ధతి మారకపోతే మిమ్మల్ని ప్రెసిడెంట్ చేసిన వారిని కూడా తిడతాం. అభివృద్ధి పై చర్చకు వస్తే మేం సిద్ధం. మీ మీటింగ్‌‌కు పల్లీలు అమ్ముకునే అంత మంది కూడా రాలేదు. బండి సంజయ్ ఒళ్లు జాగ్రత్త. ఐదు నెలలుగా మేం ఓపిక పడుతున్నాం. వరంగల్‌‌లో వరదలు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావ్? కేటీఆర్ మోకాళ్ల వరకు ప్యాంట్ మడత పెట్టుకొని నీళ్లలో తిరిగాడు. అన్నీ చూశాం. ఉద్యమాలు మాకు కొత్తేం కాదు. చేతనైతే ఢిల్లీలో మీ నాయకులతో మాట్లాడి తెలంగాణకు డబ్బులు తీసుకురండి. హైదరాబాద్‌‌లో వరదలు వస్తే సంజయ్ ఎక్కడకు పోయిండు? కేసీఆర్ ఉన్నంత కాలం మీ కుటిల బుద్ధులు నడవవు. మీ లాంటి లుచ్చాగాళ్లు మస్తుమంది వచ్చి పోయిండ్రు. కేసీఆర్‌‌తో పెట్టుకున్న వాళ్లెవరూ రాజకీయంగా బతికి బట్టకట్టలేదు’ అని రాజు చెప్పారు.

Latest Updates