లోకో ఫైలట్ పరిస్థితి విషమం: డాక్టర్లు

హైదరాబాద్ : కాచిగూడ పరిధిలో సోమవారం 2 రైల్లు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడ్డ MMTS లోకో పైలట్ చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు డాక్టర్లు. ప్రమాదం జరిగిన 8 గంటలకు రైలు క్యాబిన్ నుంచి బయటికి తీసిన చంద్రశేఖర్ ను నాంపల్లి కేర్ హస్పిటల్ కి తరలిచారు. ట్రీట్ మెంట్ ప్రారంభించిన డాక్టర్లు మంగళవారం చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు నాంపల్లి కేర్ హస్పిటల్ డాక్టర్లు.

లోకో పైలట్ పక్కటెముకలు, మూత్ర పిండాలు దెబ్బ తిన్నాయని..2 కాళ్లకు రక్త ప్రసరణ కూడా తగ్గిందని తెలిపిన డాక్టర్లు.. 24 గంటలు పర్యవేక్షించిన తర్వాతే ఏ విషయమైనా చెబుతామన్నారు. అలాగే ట్రైన్ ప్రమాదంలో గాయాలైన ముగ్గురు ప్రయాణికులకు ట్రీట్ మెంట్ అందిస్తున్నామని చెప్పారు. వారు కోలుకుంటున్నట్లు తెలిపారు డాక్టర్లు.

Latest Updates