వచ్చే నెలలో MMTS –2 పరుగులు

 హైదరాబాద్ : MMTS ఫేజ్ 2 కు మంచి రోజులొచ్చాయ్‌ . సికింద్రాబాద్-బొల్లా రం-మేడ్చల్ రూట్ లో 28 కిలోమీటర్లు, తెల్లా పూర్‌ నుంచి పటాన్ చెరు 5.5 కిలోమీటర్ల రైల్వే లైన్ కు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. దీంతో వచ్చే నెల చివరి నాటికి రైళ్లను నడిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా రు. రైల్వే సేఫ్టీ నుంచి భద్రతకు సంబంధించి సీఎంఆర్‌ అనుమతి వచ్చిన వెంటనే రైళ్లు పట్టాలెక్కుతాయి. ఇటీవల బోగీలతో కూడిన రెండు రేక్ లు కూడా నగరానికి చేరుకున్నాయి.

హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ ఫేజ్ 2 కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రయాణికులకు శుభవార్త. వచ్చే నెలలో ఎంఎంటీఎస్ ఫేజ్ 2 లోని రెండు ప్రధాన మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్లు పరుగులు పెట్టను న్నాయి. సికింద్రాబాద్–-బొల్లారం–-మేడ్చల్ రూట్ లోని 28 కిలోమీటర్లు, తెల్లపూర్ నుంచి పటాన్ చెరు 5.5 కిలోమీటర్ల రైల్వే లైన్ కు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. డబ్లింగ్, విద్యుదీకరణ, సిగ్నలింగ్, ఫ్లాట్ ఫాం ఎత్తు పెంపునకు సంబంధించిన పనులను రైల్వే అధికారులు పూర్తిచేశారు. ఇక రెండు మార్గా ల్లో ఎంఎంటీఎస్ రైళ్లు

కూత పెట్టడమే ఆలస్యం . వచ్చే నెల చివరి నాటికి ఎంఎంటీఎస్ రైళ్లను నడిపించేందుకు రైల్వే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రూట్ లో భద్రతకు సంబంధించి కమిషనర్ రైల్వే సేఫ్టీ సీఎంఆర్ నుంచి అనుమతి రావాల్సి ఉంది.

రైల్వే రూట్ ను పరిశీలించి సీఎంఆర్ అనుమతి వచ్చిన వెంటనే ఈ రెండు మార్గా ల్లో ఎంఎంటీఎస్ రైళ్లు నడుపుతామని అధికా రులు తెలిపారు. ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే లక్షా 50 వేల మంది ప్రయాణికులకు మేలు జరగనుంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్ల ద్వారా రోజుకు లక్ష మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మల్యా ఎంఎంటీఎస్ రెండో దశ పనులు పరిశీలించారు. నగరానికి చేరుకున్న రెండు రేక్ లు ఇటీవల బోగీలతో కూడిన రెండు రేక్ లు నగరానికి చేరుకున్నాయి. వీటిని సికింద్రాబాద్–-బొల్లారం-–మేడ్చల్, తెల్లపూర్–పటాన్ చెరు మార్గం లో తిప్పనున్నారు. రేక్ లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలని రైల్వే అధికా రులు

చెప్తున్నారు. ఇటీవల రాష్ ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు ఇవ్వడంతో రెండు రేక్ లను తీసుకొచ్చారు. ఇంకా నాలుగు రేక్ ల అవసరముంది. ఎంఎంటీఎస్ రెండో దశను రైల్వే, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టాలని నిర్ణయిం చాయి. మొత్తం రూ.817 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి రైల్వే శాఖ మూడింట ఒక వంతు నిధులు సమకూర్చిం ది. రైల్వే వాటాగా ఉన్న రూ.272.30 కోట్లు ఖర్చు చేసినట్లు రైల్వే అధికా రులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.544. 66 కోట్లు కాగా ఇంకా రూ.300 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని రైల్వే అధికారులు అంటున్నారు.

నిధుల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం

ఈ ప్రాజెక్ట్ రెండేళ్ల క్రితమే పూర్తి కావాల్సి ఉంది. కాని రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద ఇచ్చే నిధుల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తుం దని ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే ఎంఎంటీఎస్ రెండో దశ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఎంఎంటీఎస్ -2 ప్రాజెక్ట్ లో భాగంగా ఫలక్ నుమా–-ఉందా నగర్– శంషాబాద్ విమానశ్రయం లైన్లో 20 కిలోమీటర్లు, తెల్లపూర్–-పటాన్ చెరు రూట్ లో 5.5 కిలోమీటర్లు, సికింద్రాబాద్–బొల్లారం–-మేడ్చల్ రూట్ లో 28 కిలోమీటర్లు, సనత్ నగర్ –మౌ లాలి 22.4 కిలోమీటర్లు, మౌలాలి –-మల్కాజ్ గిరి–-సీతాఫల్ మండి 10 కిలోమీటర్లు, మౌలాలి –ఘట్ కేసర్ మధ్య 12.2 కిలోమీటర్ల వరకు పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఐతే సికింద్రాబాద్-–బొల్లారం-–మేడ్చల్, తెల్లపూర్– పటాన్ చెరు మధ్య మినహా మిగతా అన్ని మార్గా ల్లో పనులు పెండింగ్ లో ఉన్నాయి. దీనిపై

రైల్వే ప్రయాణికుల సంఘం నుంచి ఎన్ని విజ్ఞప్తులు వచ్చిన పట్టించుకునే వారు లేరు. రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు చెల్లిస్తే పనులు పూర్తి చేస్తామని రైల్వే అధికా రులు చెప్తున్నారు.

ఎంఎంటీఎస్ రెండో దశ పొడగింపు

రెండో దశ ప్రాజెక్ట్ కోసం పనులు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నప్పటికీ ఈ మార్గా న్ని మరింత విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. మొన్నటి బడ్జెట్ లో ఎంఎంటీఎస్ ఫేజ్ 2 కోసం కేంద్రం 10 లక్షల రూపాయలు కేటాయించింది. ఘట్ కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రెండో దశను పొడగించాలని భావిస్తున్నారు. ఇందుకోసం అధిక మొత్తంలో నిధులు అవసరం ఉంది. ఐతే విస్తరణకు సంబంధించి రైల్వే శాఖ రూ.20 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణకు సంబంధించి నిధుల విషయంలో గప్ చుప్ గా అయిపోయిం ది. దాదాపు 5 లక్షల మందికి మేలు చేసే ఎంఎంటీఎస్ ఫేజ్ 2 విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపాలని జోనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ కోరింది.

Latest Updates