మొబైల్స్​పై ఆఫర్లే ఆఫర్లు

పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ దిగ్గజాలు రెండు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ మొబైల్ ఫోన్ అమ్మకాలు పెంచుకోవడానికి నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. ఆఫర్లతో మోత మోగిస్తున్నాయి.  భారీ ఎత్తున ధరల తగ్గింపుతో పాటు క్యాష్‌బ్యాక్, నోకాస్ట్ ఈఎంఐలతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎకానమీలో స్లోడౌన్‌ ప్రభావం తమ మీద పడకుండా.. వీలైనంత ఎక్కువగా అమ్మకాలు సాగించడం మీదే దృష్టిపెడుతున్నాయి.

అమెజాన్‌‌‌‌

శామ్‌‌‌‌సంగ్‌‌‌‌ గెలాక్సీ ఎమ్10

శామ్‌‌‌‌సంగ్‌‌‌‌ గెలాక్సీ ఎమ్10 ఫోన్ ధర రూ.9290 కాగా,  ఆఫర్‌‌‌‌లో రూ.7999కే అందిస్తోంది అమెజాన్‌‌‌‌. ఈఎంఐలలో అయితే రూ.377 నుంచి తక్కువ మొత్తాల్లో నెలవారీ వాయిదాలు చెల్లించవచ్చు. 6.22 అంగుళాల హెచ్ డీ ఇన్ఫినిటీ వీ డిస్ల్పే దీని స్పెషాలిటీ.

రెడ్‌‌‌‌మీ వై3

దీని ధర రూ.11,999 నుంచి రూ.7,999లకు తగ్గింది. 32 ఎంపీ సెల్ఫీ స్నాపర్ కెమెరాతో పాటు, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకతలు.  పాత ఫోన్ ఎక్సేంజ్‌‌‌‌తో రూ.7400 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

శామ్‌‌‌‌సంగ్‌‌‌‌ గెలాక్సీ ఎమ్20

శామ్‌‌‌‌సంగ్‌‌‌‌ గెలాక్సీ ఎమ్20 ఫోన్ ప్రస్తుతం రూ.9999కి వస్తోంది. దీని అసలు ధర రూ.11290గా ఉంది. రూ.564 ఈఎంఐతో ఈ దీనిని
కొనుక్కోవచ్చు.

రియల్‌‌‌‌మీ యూ1

రూ.4 వేల తగ్గింపుతో ‘రియల్‌‌‌‌మీ యూ1’ ఫోన్ అందుబాటులో ఉంది. రూ.12999 ఉన్న ఈ ఫోన్ రూ.7999లకే వస్తోంది. 25 ఎంపీ సెల్ఫీ కెమెరా దీని స్పెషాలిటీ.  ఎస్‌‌‌‌బీఐ కార్డులతో కొంటే అదనంగా 10 శాతం డిస్కౌంట్‌‌‌‌ వస్తుందనే విషయం తెలిసిందే.

 

ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌

రెడ్‌‌‌‌మీ నోట్ 7ఎస్

రెడ్‌‌‌‌మీ నోట్ 7స్ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. 3జీబీ ర్యామ్‌‌‌‌, ఇంటర్నల్ మెమొరీ 32 జీబీ వేరియంట్‌‌‌‌ ధర రూ.11999 నుంచి రూ.8999కి తగ్గించారు. 4 జీబీ రామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ వేరియంట్ ఫోన్ ధర రూ.13999 కాగా,  ఇప్పుడు రూ.9999లకే కొనుక్కోవచ్చు.

 రియల్‌‌‌‌మీ 5

రూ.11999 ఉన్న రియల్‌‌‌‌మీ 5 ఫోన్ ను రూ.8999కే అందిస్తోంది ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ దీని స్పెషాలిటీ.

 రియల్‌‌‌‌మీ 2 ప్రో

రూ.13999 ధర గల రియల్‌‌‌‌మీ 2 ప్రో ను రూ.8999కి ఆఫర్లో ఇస్తున్నారు. 16 ఎంపీ సెల్ఫీ కెమెరా దీని స్పెషాలిటీ.

నోకియా 6.1 ప్లస్

నోకియా 6.1 ప్లస్  ధర రూ.17600 కాగా,  ఇది ఇప్పుడు 8999 రూపాయలకే వస్తోంది. ఇందులో 4 జీబీ ర్యామ్‌‌‌‌,  64 జీబీ స్టోరేజీ ఉంటుంది. ఐసీఐసీఐ, ఆక్సిస్‌‌‌‌ బ్యాంకు కార్డులతో కొంటే 10 శాతం డిస్కౌంట్‌‌‌‌ అదనం.

Latest Updates