మంత్లీ రీఛార్జ్‌‌కే మొగ్గుచూపుతున్న యూజర్లు

పెరిగిన టారిఫ్‌‌లే కారణం
12 నెలల రీఛార్జ్‌ ప్లాన్స్‌‌పై డిస్కౌంట్‌‌లు
టెల్కోల ఆర్పూ పెరుగుతుందని విశ్లేషకుల అంచనా

ముంబై: ఈ నెల ప్రారంభంలో ప్రీపెయిడ్ రీఛార్జ్‌‌ ప్లాన్స్‌‌ను టెల్కోలు 40 శాతం పైగా పెంచేశాయి. ఇలా పెరిగిన టారిఫ్‌‌ల వలన లాంగ్‌‌ టైం కోసం రీఛార్జ్‌‌ చేసుకునే యూజర్లు, నెల వారీ రీఛార్జ్​కు అధికంగా మొగ్గుచూపుతారని టెలికాం కంపెనీల ఎగ్జిక్యూటివ్స్‌‌ అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి యూజర్లు తమ నెట్‌‌వర్క్‌‌ ప్రొవైడర్‌‌‌‌ను మార్చుకోడానికి కూడా సిద్ధంగా ఉంటారని తెలిపారు. అందుకే భారతీ ఎయిర్‌‌‌‌టెల్‌‌, రిలయన్స్‌‌ జియో ఇన్‌‌ఫోకమ్‌‌ 12 నెలల రీఛార్జ్‌‌ ప్లాన్స్‌‌పై డిస్కౌంట్‌‌లను ప్రకటిస్తున్నాయని అన్నారు . రూ. 300 ఖర్చు పెట్టి 84 రోజులకు రీఛార్జ్‌‌ చేసుకునే స్థోమత గల యూజర్లు, ప్రస్తుతం వన్‌‌ మంత్ ప్లాన్స్‌‌తో రీఛార్జ్‌‌ చేసుకోవడానికే మొగ్గుచూపుతారని భారతీ ఎయిర్‌‌‌‌టెల్‌‌ ముంబై డిస్ట్రిబ్యూ టర్‌‌‌‌ అన్నారు. వీరు పెరిగిన టారిఫ్‌ల వలన రూ. 500 ప్లస్‌ ఖర్చు పెట్టి రీఛార్జ్‌‌ చేసుకోలేకపోవడమే దీనికి కారణమన్నారు . ఇండియా వంటి మార్కెట్‌‌లో ధరలలో వచ్చే మార్పులను అర్థం చేసుకోవడానికి ఇంకొన్ని నెలలు పడుతుందని తెలిపారు.

ఇండియాలో టారిఫ్ లు తక్కువ..
ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌లో ఎడ్జెస్టడ్‌ గ్రాస్‌ రెవెన్యూ(ఏజీఆర్‌‌‌‌)పై సుప్రీం కోర్టిచ్చిన తీర్పు వలన, టెలికాం కంపెనీలు రూ. 1.47 లక్షల కోట్ల బకాయిలను ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చింది. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి టెలికాం కంపెనీలు ఈ నెల మొదటి నుంచి టారిఫ్‌‌లను పెంచాయి. ఇలా పెరిగిన మొబైల్‌‌ బిల్స్ వలన యూజర్లు ఖర్చు పెట్టే ప్యాటర్న్‌‌ కూడా మారుతుందని, కొంత మంది యూజర్లు కేవలం డేటా రీఛార్జ్‌‌ పైనే దృష్టి పెడతారని వొడాఫోన్‌‌ స్టోర్‌‌‌‌ మేనేజర్‌‌‌‌ రవి దేశ్వాల్‌‌ అన్నారు. ఉబర్‌‌‌‌ డ్రైవర్లు వంటి యూజర్లు కేవలం తమ జీపీఎస్‌‌కే రీచార్జ్ చేసుకోవచ్చని, కాల్స్‌‌ కోసం తమ వ్యక్తి గత డివైస్‌‌లకు రీఛార్జ్‌‌ చేయకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పదేళ్ల క్రితం ఇండియన్ యూజర్లు తమ యాన్యువల్‌‌ ఇన్‌‌కంలో 6 శాతం వరకు మొబైల్‌‌ బిల్స్‌‌ కోసం ఖర్చు చేసేవారని, ఇప్పుడిది 1 శాతానికి పడిపోయిందని సెల్యులర్‌‌‌‌ ఆపరేటర్స్‌‌ అసోసియేషన్‌‌(సీఓఏఐ) డైరక్టర్‌‌‌‌ జనరల్‌‌ రాజన్‌‌ మాథ్యుస్‌ అన్నారు . ఇది ఇతర దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువని తెలిపారు. ఇండియన్‌‌ మొబైల్‌‌ కస్టమర్లు పెరిగిన ఖర్చులకు అడ్జస్ట్‌‌ అవ్వడానికి టైమ్‌‌ పడుతుందన్నారు. మొబైల్‌‌ బిల్స్‌‌ పెరగడంతో యూజర్ల వినియోగం తగ్గుతుందని, ఇది పరోక్షంగా కాల్స్‌‌ నాణ్యతను మెరుగు పరుస్తుందన్నారు. పెరిగిన టారిఫ్‌లకు అనుగుణంగా అడ్జస్ట్‌‌ అవ్వడానికి యూజర్లకు ఇంకో క్వార్టర్‌‌‌‌ (జనవరి–మార్చి నెలలు) పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కంపెనీల ఆర్పూ పెరుగుతుంది..
భారతీ ఎయిర్‌‌‌‌టెల్‌‌, వొడాఫోన్‌‌–ఐడియా, జియో 2016 తర్వాత మొదటిసారిగా ఈ నెలలో టారిఫ్‌లను పెంచాయి. ఇది టెలికాం కంపెనీల యావరేజ్‌‌ రెవెన్యూ పర్‌‌ యూజర్‌‌‌‌(ఏపీఆర్‌‌‌‌యూ ఆర్పూ) పెరగడానికి కారణమవుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న టెలికాం సెక్టార్‌‌‌‌ కోలుకోవడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని విశ్లేషకులు తెలిపారు. యూజర్లు మూడు నెలల రీఛార్జ్‌‌ ప్లాన్స్‌‌ కాకుండా ఒక నెల రీఛార్జ్‌‌ ప్లాన్స్‌‌కు మొగ్గు చూపితే, అది ఆర్పూ 40–50 శాతం పెరగడానికి కారణమవుతుందని ఎస్‌బీఐ క్యాప్‌ సెక్యూరిటీస్‌, రాజీవ్‌‌ శర్మ అన్నారు. ఇది టెలికాం కంపెనీలు పెట్టుకున్న టార్గెట్‌‌ కంటే ఎక్కువని తెలిపారు. రానున్న రెండు క్వార్టర్‌‌‌‌లో వొడాఫోన్‌‌–ఐడియా ఆర్పూ రూ. 107 నుంచి రూ. 143 కి పెరుగుతుందని, ఎయిర్‌‌‌‌టెల్‌‌ ఆర్పూ రూ. 128 నుంచి రూ. 145–150 కి పెరుగుతుందని అంచనా. రిలయన్స్‌‌ జియో ఆర్పూ ఆర్థిక సంవత్సరం 2020 చివరి క్వార్టర్‌‌‌‌ నాటికి రూ. 140 కి పెరుగుతుందని అంచనావేశారు. సెప్టెంబర్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌లో జియో ఆర్పూ రూ. 120గా ఉంది. ఏజీఆర్‌‌‌‌పై సుప్రీం కోర్టిచ్చిన తీర్పు వలన వొడాఫోన్‌‌–ఐడియా, భారతీ ఎయిర్‌‌‌‌టెల్‌‌ జనవరి 24, 2020 నాటికి రూ. 89 ,000 కోట్ల బకాయిలను చెల్లించాల్సి వుంది. ఈ రెండు కంపెనీలు ఈ నెల మూడవ తేదిన టారిఫ్‌లను పెంచాయి. జియో ఈ కంపెనీల కంటే 25 శాతం తక్కువతో టారిఫ్‌లను పెంచింది. జియోకు 35 కోట్ల సబ్‌ స్ర్కయిబర్లు ఉండగా, వొడాఫోన్‌‌–ఐడియాకు 31.1 కోట్ల సబ్‌ స్క్రయిబర్లు, ఎయిర్‌‌‌‌టెల్‌‌కు 28
కోట్ల సబ్‌ స్ర్కయిబర్లున్నారు.

For More News..

దుబాయ్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి

అత్తను రాయితో కొట్టిచంపిన కోడలు

Latest Updates