అడ్వొకేట్ల కోసం మొబైల్ వీడియో కాన్ఫరెన్స్ వెహికల్స్‌

వరంగల్ జిల్లాలో అందుబాటులోకి తీసుకొచ్చిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: కరోనా కారణంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అత్యవసర కేసులను విచారిస్తున్న హైకోర్టు మరో అడుగు ముందుకేసింది. వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం అందుబాటులో లేని న్యాయవాదుల కోసం ‘మొబైల్‌ వీడియో కాన్ఫరెన్స్‌’ సౌకర్యం కల్పిస్తోం ది. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు మొబైల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ వెహికల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ ఏర్పాటుచేసిన మొబైల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ వాహనా-న్ని చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌ సమక్షంలో ఆ జిల్లా పోర్టుపోలియో జడ్జి, హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్ రావుసోమవారం ప్రారంభించారు. లాక్ డౌన్ తర్వాత నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే అత్యవసర కేసుల్ని హైకోర్టు విచారిస్తోంది. ఈ సౌకర్యం లేని లాయర్లు సికిం ద్రాబాద్ లోని లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీస్‌ ఆఫీసులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రిట్లపై వాదనలు వినిపిం చే సౌకర్యం కల్పించింది. తాజాగా జిల్లాల్లోని అన్ని పట్టణాల్లో మారుమూల ప్రాంతాలకూ మొబైల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ వెహికల్స్‌ అందుబాటులో ఉండేలా హైకోర్టు ఏర్పాట్లు చేయిస్తోందని రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వర్ డ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జులై 20 వరకూ హైకోర్టు సహా రాష్ట్రంలోని అన్ని కోర్టులకు లాక్ న్‌ పొడిగించి నందున మొబైల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ వెహికల్‌ ఎంతో ఉపయోగపడుతుందని న్యాయవాదులు అంటున్నారు.