మొబైల్ వ్యాలెట్లకు ఆర్బీఐ గుడ్ న్యూస్

మొబైల్ వ్యాలెట్లు వాడుతున్నవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్. కేవైసీ గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆర్బీఐ. ఆగస్టు 31 తో ఈ గడువు ముగిసింది. లేటెస్ట్ గా ఈ గడువును  2020 ఫిబ్రవరి 29 వరకు పొడిగించింది. మళ్లీ గడువును పొడిగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఫిబ్రవరి లోగా  పేటీఎం,పోన్ పే,గూగుల్ పే వంటి వ్యాలెట్లకు కేవైసీ అప్ డేట్  చేయించుకోవాలని సూచించింది. లేకపోతే వ్యాలెట్లు పనిచేయబోవని చెప్పింది.

Latest Updates