అమెరికాలో క‌రోనా వ్యాక్సిన్ ..తొలిద‌శ ప్ర‌యోగం స‌క్సెస్

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ కోసం ప్ర‌యోగాలు జ‌రుగుతున్నాయి. ఆ రేసులో ర‌ష్యా ముంద‌జ‌లో ఉంది. ర‌ష్యా త‌యారు చేస్తున్న క‌రోనా వ్యాక్సిన్ తొలిద‌శ ప్ర‌యోగం విజ‌యం సాధించిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ వ్యాక్సిన్ ను తయారు చేసింది. ట్ర‌య‌ల్స్ లో భాగంగా 45మంది వాలంటీర్ల‌పై ప్ర‌యోగాలు జ‌రిపిన‌ట్లు, ఆ ప్రయోగాల్లో మోడెర్నా త‌యారు చేసిన వ్యాక్సిన్ వ‌ల్ల వాలంటీర్ల‌లో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే యాంటీబాడీలు త‌యారైన‌ట్లు న్యూ ఇంగ్లండ్ జ‌ర్న‌ల్ ఆఫ్ మెడిసిన్ ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

సీటెల్ తో పాటు ఎమోరీ యూనివ‌ర్సిటీలో 18-55 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సున్న వారిపై ప్ర‌యోగాలు చేసింది. ఈ ప్ర‌యోగాల్లో మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎవ‌రికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ న‌మోదు కాలేదు. కానీ త‌ల‌నొప్పి, వ‌ణుకుడు వ‌చ్చిన‌ట్లు క‌థ‌నంలో పేర్కొంది.

ఈ వ్యాక్సిన్‌ను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్‌ఐఐఐడి), మరియు యుఎస్‌లోని మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లోని మోడరనా ప‌రిశోధ‌న‌ల్లో కొన్ని స‌మ‌స్య‌లు తలెత్తిన‌ట్లు తెలుస్తోంది.

తాజాగా మోడెర్నా త‌యారు చేస్తున్న వ్యాక్సిన్ లో స‌త్ఫ‌లితాలు క‌నిపిస్తున్నాయాని, ఎలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌డం లేద‌ని సైంటిస్ట్ లు చెబుతున్నారు.రెండవ టీకా తరువాత ప్రతికూల సంఘటనలు ఎక్కువగా కనిపిస్తాయని వివరించారు.

పరిశోధనలపై వైరాల‌జిస్ట్ యుకెలోని కార్డిఫ్ యూనివ‌ర్సిటీ సైంటిస్ట్ ఆండ్రూ ఫ్రీడ్‌మాన్ మాట్లాడుతూ టీకాలు వేసిన తరువాత స‌మ‌స్య‌లు త‌లెత్త‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని అన్నారు

Latest Updates