ట్రంప్ కు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫోన్ లో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ట్రంప్ కుటుంబంతో పాటు అమెరికా ప్రజలు కొత్త సంవత్సరంలో ఆరోగ్యంగా ఉండాలని, మంచి ఫలితాలు సాధించాలని మోడీ ఆకాంక్షించారు. కొంత కాలంగా భారత్, అమెరికా మధ్య సంబంధాలు బలపడ్డాయని చెప్పారు ప్రధాని. రెండు దేశాల మధ్య  వ్యూహాత్మక భాగస్వామ్యం మంచి పురోగతి సాధించిందన్నారు. పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో అమెరికాతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ట్రంప్ తో చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత ప్రజలకు న్యూ ఇయర్ విషెష్ చెప్పారు. భారత్ తో ద్వైపాక్షిక సహకారం మరింత పెరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Latest Updates