ఉత్తరాఖండ్ టూర్ లో మోడీ…కేదార్ నాథ్ లో ప్రత్యేక పూజలు

modi-arrives-in-kedarnath-he-will-offer-prayers

చివరి విడత ఎన్నికలకు ముందు దైవ సన్నిధిలో గడుపుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఉత్తరాఖండ్ కు వెళ్లారు. ప్రత్యేక హెలికాప్టర్ లో కేదార్ నాథ్ కు వెళ్లిన ప్రధాని…అక్కడ బోలేనాథ్ కు పూజలు నిర్వహించారు. ప్రత్యేక వేషదారణలో కేదార్ నాథ్ టెంపుల్ ను సందర్శించారు…. ఆ తర్వాత కేథార్ నాథ్ విశేషాలను ప్రధాని మోడీకి వివరించారు అధికారులు.

మరోవైపు రేపు బద్రీనాథ్ లో ప్రత్యేక పూజలు చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే విజయంపై ధీమాగా ఉన్న ప్రధాని…కేదార్ నాథ్ ఆలయానికి పలు సార్లు వెళ్లారు. మోడీ పర్యటనకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, ఇది కేవలం పూర్తి ఆధ్యాత్మిక పర్యటన మాత్రమే అని ఉత్తరాఖండ్ బీజేపీ నేతలు చెప్పారు.

Latest Updates