మోడీ ప్రజలకు చౌకీదార్ కాదు : కపిల్ సిబాల్

ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్. ప్రధాని మోడీ ప్రజలకు చౌకీదార్ కాదన్నారు. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత బీజేపీ నేత ఒకరు కొత్త నోట్ల మార్పిడికి డీల్ కుదుర్చుకుంటున్న వీడియోను విడుదల చేశారు సిబాల్. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 40శాతం కమీషన్ తో డీల్ చేసుకుంటున్నట్టు వీడియోలో ఉంది. మోడీ ప్రజలకు కాకుండా అక్రమార్కులకు మాత్రమే చౌకీదార్ అని విమర్శించారు కపిల్ సిబాల్. ఈ ప్రెస్ మీట్ లో ఇతర ప్రతిపక్ష నేతలు కూడా పాల్గొన్నారు.

Latest Updates