ఆవులపై మోడీ కామెంట్స్ : స్పందించిన అసదుద్దీన్

ఆవు, ఓం అనే పదాలు వింటే కొందరికి కంగారు పుడుతోందన్న ప్రధానమంత్రి మోడీ కామెంట్స్ పై స్పందించారు MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. ఆవులను, ఇతర జంతువులను కాపాడటానికి ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. జార్ఖండ్ లో మూకదాడుల్లో 11 మంది మైనారిటీలు, దళితులు చనిపోయారని.. వారి కుటుంబసభ్యుల బాధ ప్రధానికి తెలియలేదా అని ప్రశ్నించారు. దేశంలోని పౌరులందరికి రాజ్యాంగం జీవించే హక్కు కల్పించిందన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు అసదుద్దీన్.

అయితే బుధవారం ఉత్తరప్రదేశ్ లో పర్యటించిన మోడీ గో సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గో పూజ నిర్వహించారు. గోవులను కాపాడటం నేరం కాదని, కొంతమందికి ఓం, ఆవు అనే శబ్ధాలంటే భయమన్నారు. వారంతా 16వ శతాబ్దంలోనే ఉన్నారంటూ విపక్షాలపై ఫైర్ అయ్యారు మోడీ.

 

Latest Updates