40మంది మృతి: జవాన్ల త్యాగాలు వృధా కావు: ప్రధాని మోడీ

జమ్మూ కశ్మీర్, పుల్వామా లో.. CRPF కాన్వాయ్ పై జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని మోడీ ఆరా తీశారు. జవాన్ల త్యాగాలు వృధా కావని చెప్పారు. “దేశం మొత్తం అమరులైన సైనికుల కుటుంబాలకు అండగా ఉండాలని.. గాయపడిన వారు త్వరగా తిరిగి వస్తారని” ట్వీట్ చేశారు. దీంతో పాటే.. హోం మినిష్టర్ రాజ్ నాథ్ సింగ్ కు పరిస్థితులను సమీక్షించాల్సిందిగా కోరారు మోడీ.

350 కిలోల పేలుడు పదార్థాలు కలిగి ఉన్న క్కార్పియో వాహనంతో ..  CRPF జవాన్లు ప్రయాణిస్తున్న క్యాన్వయ్ ను ఉగ్రవాదులు ఢీకొట్టారు.. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు.

రంగంలోకి దిగిన అజిత్ దోవల్:
CRPF కాన్వాయ్ పై పేలుడు జరగడంతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. మిలిటరీ అధికారులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. దాడిని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కాంగ్రెస్‌ చీఫ్ రాహుల్‌ గాంధీ, పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు పలువురు నేతలు ఖండించారు.

రెండు సంవత్సరాల క్రితం ‘ఉరి’ లో జరిగిన ఘటన కంటే ఈ దాడి పెద్దది. ఉరి దాడి జరిగిన 11 రోజుల తరువాత భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ చేసి పాక్ భూబాగంలో ఉన్న ఉగ్ర మూకలను ఏరివేసింది.

Latest Updates