గాంధీ మార్గంలో మోడీ ప్రభుత్వ పాలన: కిషన్ రెడ్డి

మహాత్మాగాంధీ 150 జన్మదినం సందర్బంగా మోడీ ఆదేశాలతో ప్రతీ బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ 150 కిలోమీటర్ల సంకల్ప యాత్ర చేస్తున్నామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తార్నాక లోని  మానికేశ్వర్ నగర్ నుండి రవీంద్ర నగర్ మీదుగా పిట్టల బస్తీ వరకు మహాత్మా గాంధీ సంకల్ప యాత్ర లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి…గాంధీ మార్గంలో మోడీ ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. స్వచ్ఛ భారత్, వన్ టైమ్ యూజ్ ప్లాస్టిక్ ని వాడకుండా జనాల్లో అవగాహన తీసుకోస్తామన్నారు. ప్రతీ ఒక్కరు వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పేద ప్రజల కోసం మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలను చేపడుతోందన్నారు.ఆయుష్మాన్ భారత్ ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఆరోపించారు.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు మోడీ సర్కారు సరైన బుద్ధి చెబుతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Latest Updates