‘స్పేస్​ శక్తి’కి కొత్త సంస్థ

modi-govt-approves-new-agency-to-develop-space-warfare-weapon-systems

డిఫెన్స్​ స్పేస్​ రీసెర్చ్​ ఏజెన్సీ ఏర్పాటుకు మోడీ సర్కార్​ నిర్ణయం

న్యూఢిల్లీ: అంతరిక్షంలో యుద్ధం వస్తే, దాన్ని దీటుగా ఎదుర్కోవాలన్న లక్ష్యంతో సరికొత్త సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ(డీఎస్​ఆర్​వో)గా  పిలిచే ఈ కొత్త సంస్థ ద్వారా స్పేస్​లో అత్యాధునిక వెపన్​ సిస్టమ్స్​ని, కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తారు. దీనికి ప్రధాని మోడీ నాయకత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్​ కమిటీ ఇటీవలే ఆమోదం తెలిపిందని రక్షణ శాఖ వెల్లడించింది. బెంగళూరు కేంద్రంగా డీఎస్​ఆర్​వో ఏర్పాటు కానుందని, జాయింట్​ సెక్రటరీ స్థాయి సైంటిస్ట్​ పర్యవేక్షణలో ప్రక్రియ మొదలైందని అధికారులు చెప్పారు.  త్రివిధ దళాలతో కలిసి పరిశోధనలు సాగిస్తున్న సైంటిస్టుల బృందాలనే కొత్త ఏజెన్సీలోకి తీసుకోనున్నారు.  ప్రస్తుతమున్న డిఫెన్స్​ స్పేస్​ ఏజెన్సీ(డీఎస్​ఏ)కు అవసరమయ్యే రీసెర్చ్​, డెవలప్​మెంట్​ సపోర్ట్​ను డీఎస్​ఆర్​వో అందించనుంది. భూమి నుంచి స్పేస్​లోని శాటిలైట్​ను మిసైల్​తో నేలకూల్చే ‘యాంటి శాటిలైట్​(ఏ–శాట్​) మిస్సైల్​ టెస్ట్’ను గత మార్చిలో డిఫెన్స్ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ ఆర్గనైజేషన్​(డీఆర్​డీవో) విజయవంతంగా నిర్వహించడం తెలిసిందే. తద్వారా అమెరికా, రష్యా, చైనా తర్వాత  నాలుగో దేశంగా ఇండియా అవతరించింది.

Latest Updates