కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ దీపావళి గిఫ్ట్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్ ఇచ్చింది మోడీ సర్కార్. బుధవారం ప్రెస్ మీట్లో మాట్లాడిన కేంద్ర మంత్రి ప్రకాష్ జయదేవ్ కర్… కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు శాతం చొప్పున DA పెంచినట్లు చెప్పారు.  ప్రస్తుతం 12శాతంగా ఉన్న DA తాజా పెంపుతో 17శాతానికి చేరింది. దీనివల్ల 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు లబ్ది పొందనుండగా… ప్రభుత్వంపై 16వేల కోట్ల వరకు భారం పడనుంది. కశ్మీర్ శరణార్థులకు గతంలో ప్రకటించిన 5లక్షల 50వేల ఆర్థిక సాయాన్ని మరో 5వేల 300 కుటుంబాలకు అందించనుంది ప్రభుత్వం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులకు ఆధార్ సీడింగ్ నుంచి నవంబర్ 30 వరకు రిలాక్సేషన్ ఇచ్చింది కేంద్రం.

Latest Updates