దేశానికి పనికి వచ్చే నిర్ణయాలను మోడీ తీసుకున్నారు : కిషన్ రెడ్డి

గుంటూరు: ఎన్డీయే సర్కారు ఐదేళ్ల వంద రోజుల పాలనలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. సోమవారం గుంటూరులో మాట్లాడిన ఆయన.. దేశ సమైక్యత కోసం పనికి వచ్చే నిర్ణయాలు మోడీ తీసుకున్నారని తెలిపారు. దేశాన్ని పట్టి పీడీస్తున్న సమస్యలను పరిష్కరించడంలో మోడీ కృషి చేశారని చెప్పిన ఆయన..సంస్కరణల్లో వేగం పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరి సంక్షేమం, సామాజిక న్యాయం కోసం నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. మోడీ నేతృత్వంలో ఆర్థిక వ్యవస్థ అదనంగా లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుందని..ఈ ఏడాదిలో మూడు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఏర్పడనుందన్నారు.

ఆర్టికల్ 370 రద్దు ఓ సాహసోపేత నిర్ణయమన్న ఆయన..కాశ్మీర్ లో 70 ఏళ్లుగా అణచివేతకు గురైన ఎన్నో వర్గాల వారు ఇపుడు ఊరట పొందారన్నారు. ప్రాథమిక హక్కులు లేని ఆటవిక రాజ్యం ఇన్నాళ్లూ కొనసాగిందని..విద్యా హక్కు చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, అవినీతి నిరోధక చట్టం వంటి కీలక చట్టాలు కాశ్మీర్లో ఇన్నాళ్లూ లేవని తెలిపారు కిషన్ రెడ్డి.

Latest Updates