దేశ ప్రజలే నాకు హైకమాండ్: ప్రధాని మోడీ

ఢిల్లీలోని తాల్ కటోరా ఇండోర్ స్టేడియంలో ‘మై బీ చౌకీదార్’ మెగా క్యాంపెయిన్ చేప్టటారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమానికి బీజేపీ ముఖ్య నాయకులు, కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఈ ప్రచారానికి దేశంలోని 500 ప్రాంతాల నుంచి జనం వచ్చారు. మొత్తం 4 వేల మంది హాజరయ్యారు.  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలతో మాట్లాడారు మోడీ. 125 కోట్ల దేశ ప్రజలే తనకు హైకమాండ్ అన్నారు. దేశం కన్నా రాజకీయాలేమీ ముఖ్యం కాదన్నారు. బాలాకోట్ ఎటాక్ క్రెడిట్ అంతా సైనికులదేనని చెప్పారు మోడీ. సభలో పాల్గొన్నవారు అడిగిన ప్రశ్నలకు సమాదానాలు చెప్పారు. ‘మిషన్ శక్తి’ కాంగ్రెస్ హయాంలో జరిగితే ఎందుకు ప్రపంచాని చెప్పలేదని అన్నారు. ఈ మిషన్ శక్తి ఏదేశాన్ని ఉద్ధేశించి తయారు చేసింది కాదని అన్నారు.

Latest Updates