15 ఏళ్లలో టాప్ 3 లో భారత్ : మోడీ

సౌత్ కొరియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాజధాని సియోల్ నగరంలో ప్రవాస భారతీయులు ఏర్పాటుచేసిన సభలో పాల్గొన్నారు. ప్రవాసులు మోడీకి ఘనస్వాగతం పలికారు. భారతీయులు ఎక్కడున్నా మహాత్మాగాంధీ వారసత్వాన్ని ప్రపంచానికి చాటాలని చెప్పారు. రాబోయే 15 ఏళ్లలో ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన 3 ప్రధాన దేశాల్లో ఇండియాను ఒక్కటిగా నిలబెట్టడమే తమ లక్ష్యమని చెప్పారు.

మోడీకి సియోల్ శాంతి బహుమతి

“సియోల్ పీస్ ప్రైజ్ ను రేపు అందుకోబోతున్నా. ఈ బహుమతి నాకు దక్కిన గౌరవం మాత్రమే కాదు. 130 కోట్ల మంది భారతీయులు, 3 కోట్లమంది ప్రవాస భారతీయుల ప్రతినిధిగా ఈ బహుమతి అందుకోబోతున్నా. ప్రతి భారతీయుడి శ్రమకు, కష్టపడే తత్వానికి ఈ పురస్కారం ఓ గుర్తింపు లాంటిది” అని మోడీ చెప్పారు.

Latest Updates